Tamanna: ఒక్క సాంగ్ కి 3 కోట్లు.. తగ్గేదేలే అంటున్న తమన్నా

Tamanna: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసిపోతూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది. వయసు పెరుగుతున్నా కూడా తన అందాలు, ఆకర్షణ శక్తి రోజురోజుకూ మరింత పెరుగుతూనే ఉందని అభిమానులు అంటున్నారు.

తమన్నా ఇప్పుడు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, ఐటెం సాంగ్స్‌తో కూడా దుమ్మురేపుతోంది. బిగ్ స్క్రీన్‌పై గ్లామర్ డ్యాన్స్‌లతో హోరెత్తిస్తూ, సినిమాకే హైలైట్ అవుతోంది. రీసెంట్‌గా స్త్రీ 2 సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.

సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు తమన్నా సుమారు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. అయితే ఒక్క స్పెషల్ సాంగ్‌ కోసం కూడా రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకూ వసూల్ చేస్తోందట. నిర్మాతలు కూడా ఆమెకు ఉన్న మాస్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాలను ఇవ్వడానికి ఎటువంటి వెనుకాడటం లేదు.

సినిమా చేయాలంటే నెలల తరబడి డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. కానీ ఒక ఐటెం సాంగ్‌ అయితే గరిష్టంగా వారం రోజుల్లోనే షూటింగ్ పూర్తి అవుతుంది. ఇదే కారణంగా తమన్నా ప్రస్తుతం మిగతా స్టార్ హీరోయిన్‌ల కంటే ఎక్కువగా సంపాదిస్తోంది.

మొత్తానికి, తన గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్‌తో తమన్నా స్టార్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, స్పెషల్ సాంగ్స్ క్వీన్‌గా కూడా టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *