Weather Update: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. కాకినాడ, అనకాపల్లి, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
మరికొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్’, ‘ఎల్లో’ అలర్ట్‌లు కూడా జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలు, పిడుగుల కారణంగా నష్టం వాటిల్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద, నీటి ప్రవాహాల దగ్గర ఉండవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు.