Jonita Gandhi

Jonita Gandhi: హీరోయిన్ గా మారిన పాన్ ఇండియా హాట్ సింగర్!

Jonita Gandhi: పాపులర్ ప్లేబ్యాక్ సింగర్‌గా మొత్తం ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న జోనితా గాంధీ ఇప్పుడు అభినయ రంగంలోకి అడుగుపెట్టారు. విఘ్నేష్ శివన్, నయనతార భార్యాభర్తల రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘వాకింగ్ టాకింగ్ స్ట్రాబెరీ ఐస్‌క్రీమ్’ అనే ఇంగ్లీష్ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. కొత్త దర్శకుడు వినాయక్ వి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా, వినూత్న కథతో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని నిర్మాణ బృందం విశ్వాసం వ్యక్తం చేస్తుంది.

జోనితా గాంధీకి ఈ చిత్రం ద్వారా సినీ రంగంలో మొదటి అడుగు. కెనడా బోర్న్ పంజాబీ అమ్మాయిగా, బ్రాంప్టన్‌లో పెరిగిన జోనితా తండ్రి, అన్నయ్యలు స్థానిక సంగీత కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. 16 ఏళ్ల వయసులో ‘కెనడియన్ ఐడల్’ ఆడిషన్‌లో పాల్గొన్నా అవకాశం దక్కలేదు. అయినా, యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ పాడటం మొదలుపెట్టి, సోను నిగామ్‌తో టూర్‌లు చేసి, ఇండియన్ సినిమా రంగంలోకి ప్రవేశించారు. 2013లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో విశాల్-షేకర్ సంగీతంలో పాట పాడి డెబ్యూ చేశారు.

Also Read: Bollywood Cinema: బాలీవుడ్ కి ఫ్రాంచైజ్ పిచ్చి పట్టింది.. ఫ్లాప్ అయిన పర్లేదు సీక్వెల్స్ తీయాలి..!

జోనితా యూత్‌లో సూపర్‌స్టార్ స్థాయి క్రేజ్ సంపాదించారు. 2022లో విజయ్ స్టారర్ ‘బీస్ట్’ చిత్రంలో అనిరుధ్ రవిచందర్‌తో కలిసి ‘అరబిక్ కుత్తు’ పాట పాడారు. ఈ హై-ఎనర్జీ ట్రాక్ పాన్-ఇండియా లెవెల్‌లో వైరల్ అయ్యి, బిలియన్స్ వ్యూస్ రికార్డ్ చేసింది. దీంతో స్టేజ్ షోలు, కాన్సర్టులతో బిజీ అయ్యారు. ‘డాక్టర్’, ‘మెంటల్ మనధిల్’ వంటి చిత్రాల్లో పాటలు పాడి మరింత ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూ, 2024లో సోలో పాప్ ఆర్టిస్ట్‌గా ‘లవ్ లైక్ దట్’ ఈపీ సింగిల్ విడుదల చేశారు. ఇక ఇప్పుడు అభినయంలోకి వచ్చి, చిన్న కానీ ఫన్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న పోస్ట్‌లో, “పికు పాత్రలో నేనున్నా… హోప్ ఐ డిడ్న్‌ట్ సక్ అట్ ఇట్! వెరీ ఫన్ ఎక్స్‌పీరియన్స్” అంటూ జోనితా ఎక్సైట్‌మెంట్ చూపించారు. జోనితా యాక్టింగ్ ప్రదర్శన ఎలా ఉంటుంది? వినూత్న స్టోరీతో ఈ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది? వేచిచూడాలి.  రౌడీ పిక్చర్స్ టీమ్ త్వరలో డేట్, ప్లాట్‌ఫామ్ వివరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *