Perni Nani

Perni Nani: పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ చిన్నికి ప్రజా సేవ కంటే ఇతర వ్యాపకాలే ముఖ్యమని ఆరోపించారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని చిన్ని పరువు తీశారని ఆయన మండిపడ్డారు.

“రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా మాట్లాడుతున్నారు”
‘ఎంపీ చిన్నికి ప్రజా సేవపై దృష్టి లేదు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా మాట్లాడుతున్నారు. బెజవాడ ఎంపీ స్థానాన్ని ఆయన అధమ స్థాయికి పడేశారు’ అంటూ పేర్ని నాని విమర్శించారు. చిన్ని అందరిపై కేసులు పెడుతున్నారని, కావాలంటే పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. ‘బియ్యం కొట్టేశామని మాపై కేసు పెట్టారు’ అంటూ నాని ఎద్దేవా చేశారు.

“కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేదు”
కంచికచర్లలో డంపింగ్ యార్డ్‌ను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఎంపీగా కేశినేని చిన్ని కేంద్రం నుంచి నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, అనవసర విషయాలపై చిన్ని దృష్టి సారించారని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *