Gold Price Today: ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ధరలు ఏ క్షణంలో ఎంత పెరుగుతాయో, ఎంత తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, కానీ..
సెప్టెంబర్ 18, గురువారం బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ, అది వినియోగదారులకు పెద్దగా ఊరటనిచ్చేదిగా లేదు. ఎందుకంటే తగ్గినప్పుడు కేవలం పదుల సంఖ్యలో తగ్గుతున్న ధరలు, పెరిగినప్పుడు మాత్రం వందల్లో పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు నిత్యం పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం కొనాలంటే సుమారు లక్షా పదివేలకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
* ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,11,850. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,540.
* ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు: ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 1,11,700. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,390గా ఉంది.
* చెన్నై: ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12,030. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,690.
ఆకాశాన్ని అంటుతున్న వెండి ధరలు
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,31,900లకు చేరుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పవర్ రంగం నుంచి వెండికి డిమాండ్ పెరుగుతోందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వంటివి ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.