Rajni-Kamal: కోలీవుడ్‌లో మళ్లీ ఒక భారీ మల్టీస్టారర్ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు 35 ఏళ్ల తర్వాత కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమంలో కమల్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఎవరు అన్న విషయంలో గందరగోళం నెలకొంది.
Buzz- #Rajinikanth & #KamalHaasan are acting in a film together.
– While there was news that #LokeshKanakaraj was going to direct the next film, now it has been reported that he is not likely to direct that film.
– “So now there is a question as to who is directing this film.… pic.twitter.com/sFFXkk0xWi
— s5news (@s5newsoffical) September 17, 2025
కొద్ది రోజులుగా ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. ‘మాస్టర్’, ‘విక్రం’, ‘లియో’ వంటి హిట్స్ ఇచ్చిన లోకేశ్, ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్‌షాట్ డైరెక్టర్. అందుకే రజనీ-కమల్ లాంటి లెజెండ్స్ కాంబోను ఆయనే హ్యాండిల్ చేస్తాడని అందరూ నమ్మారు. కానీ తాజా సమాచారం ప్రకారం, లోకేశ్ ఈ సినిమా దర్శకత్వం వహించడంలేదట.
ఇది కూడా చదవండి: Ilaiyaraaja: నెట్‌ఫ్లిక్స్‌కు షాక్.. ఇళయరాజా పాటల వివాదంపై కోర్టు కీలక తీర్పు
తెలుస్తున్న వివరాల ప్రకారం – ఈ చిత్రానికి లోకేశ్ కథ మాత్రమే ఇస్తాడు. దర్శకత్వ బాధ్యతలు మాత్రం యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ చేపట్టబోతున్నాడట. హీరోగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘డ్యూడ్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, ఇటీవలే డైరెక్షన్‌లో కూడా అడుగుపెట్టాడు. అతడే రజనీ-కమల్ మల్టీస్టారర్‌ను డైరెక్ట్ చేస్తాడన్న వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు, లోకేశ్ ప్రస్తుతానికి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యాక వచ్చే ఏడాది ఆరంభంలో ‘ఖైదీ 2’ ను కార్తీతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అభిమానులు కూడా ఈ సీక్వెల్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అందుకే రజనీ-కమల్ సినిమా నుంచి లోకేశ్ తప్పుకోవడం కొంతమందికి నిరాశ కలిగించినా, మరికొందరికి సంతోషం కలిగించింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒకే ప్రశ్న ట్రెండ్ అవుతోంది –
👉 ‘కూలీ’ ఫలితమే లోకేశ్‌పై ప్రభావం చూపిందా?
👉 లేక అసలు మొదట్నుంచే ఈ మల్టీస్టారర్‌కి అతడ్ని పరిగణలోకి తీసుకోలేదా?
ఏది ఏమైనా, రజనీకాంత్ – కమల్ హాసన్ కలిసి తెరపై కనిపించబోతున్నారన్న వార్తే సినీప్రియులకు సెలబ్రేషన్. ఈ కాంబినేషన్‌కు తగిన స్టోరీ, డైరెక్టర్ ఫైనల్ అయితే, కోలీవుడ్‌లో మరో ఇండస్ట్రీ హిట్ రాయబడే అవకాశం ఉంది.