Richie Richardson: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం (షేక్ హ్యాండ్) చేయడానికి నిరాకరించారు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ, పైక్రాఫ్ట్‌ను మిగతా మ్యాచ్‌లకు రిఫరీగా తొలగించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే తాము టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించింది. మొదట, ఐసీసీ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.
కరచాలనం చేయకూడదని చెప్పింది మ్యాచ్ రిఫరీ కాదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించింది. అయితే, పీసీబీ తన డిమాండ్‌పై గట్టిగా నిలబడింది. పీసీబీ తమ జట్టును టోర్నమెంట్ నుంచి వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు, పైక్రాఫ్ట్‌ను పాకిస్థాన్ మ్యాచ్‌లకు రిఫరీగా తొలగించారు. ఈ నిర్ణయం పాకిస్థాన్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా వర్తిస్తుందని సమాచారం.
ఇది కూడా చదవండి: Mahesh Kumar goud: రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్
అతని స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం రిచీ రిచర్డ్సన్ బాధ్యతలు చేపట్టారు. పైక్రాఫ్ట్‌ను తొలగించడంతో పీసీబీ తన బెదిరింపును వెనక్కి తీసుకుంది. పాకిస్థాన్ జట్టు యూఏఈతో జరగబోయే మ్యాచ్‌లో ఆడుతుంది. అయితే, ఈ మార్పు కేవలం పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్‌కే పరిమితమా లేక మిగతా టోర్నమెంట్ మ్యాచ్‌లకు కూడా వర్తిస్తుందా అనే దానిపై ఇంకా ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.