Pre Launch Scam: హైదరాబాద్‌లోని కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) శ్రీకాంత్‌ను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కృతికా ఇన్‌ఫ్రా డెవలపర్స్ ‘ప్రీ-లాంచ్’ ఆఫర్ల పేరుతో ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామని ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది.
బోడుప్పల్, సరూర్ నగర్, తట్టి అన్నారం వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడతామని చెప్పి, దాదాపు రూ.70 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 40 కుటుంబాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేశాయి. తమ నుంచి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసి, నాలుగు సంవత్సరాలు గడిచినా ప్లాట్లు గానీ, ఫ్లాట్లు గానీ ఇవ్వలేదని వారు వాపోయారు..
ఇది కూడా చదవండి: Madan Lal on Mohammad Yousuf: పాకిస్థాన్ క్రికెటర్ల చదువూ, సంస్కారం అలాంటిది: మదన్‌లాల్ ఫైర్
ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారించి, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.