Ilaiyaraaja

Ilaiyaraaja: నెట్‌ఫ్లిక్స్‌కు షాక్.. ఇళయరాజా పాటల వివాదంపై కోర్టు కీలక తీర్పు

Ilaiyaraaja: కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం థియేటర్లలో ఘనవిజయం సాధించినప్పటికీ, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో.. పాటల కాపీరైట్ సమస్య కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది. మద్రాసు హైకోర్టు తీర్పు ఈ వివాదానికి కొత్త మలుపు తెచ్చింది.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 2025లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మే 8, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన ‘ఓతా రూబైయుమ్ తారే’ (నట్టుపురా పట్టు), ‘ఎన్ జోడి మంజల్ కురువి’ (విక్రమ్), ‘ఇలమై ఇదో ఇదో’ (సకల కళా వల్లవన్) పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ఇళయరాజా మద్రాసు హైకోర్టులో దావా వేశారు. ఈ పాటలు సినిమాలో కొంత సమయం పాటు ఉపయోగించబడ్డాయి. ఇళయరాజా రూ.5 కోట్ల నష్టపరిహారం, పాటల తొలగింపు కోరారు.

Also Read: Prabhas: ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ భారీ ప్రాజెక్ట్.. స్టార్ట్ ఎప్పుడు?

మద్రాసు హైకోర్టు ఈ కేసును విచారించి, ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సినిమాలో ఆయన పాటలను ప్రదర్శించకూడదని, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వుల మేరకు నెట్‌ఫ్లిక్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో లేదు, ఇది అభిమానుల్లో నిరాశను కలిగించింది. సినిమా నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ వివాదంపై మీడియాతో మాట్లాడుతూ, సినిమా విడుదలకు ముందే అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగా పాటలను ఉపయోగించామని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *