Teenmar Mallanna: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. .ఇప్పటికే ఆయన గత కొన్నాళ్లుగా బీసీల ఉద్ధరణే లక్ష్యంగా రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపైన, కులగణన సర్వేపైనా సొంత పార్టీ సర్కారుపైనే విమర్శలు గుప్పించి, ఆ తర్వాత కొన్ని వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత బీసీ నేతలతో కలిసి వివిధ అంశాలపై పోరాడుతూ వస్తున్నారు.
Teenmar Mallanna: బీసీ నినాదంతోనే తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుటుందని తెలిసింది. ఈ రోజు (సెప్టెంబర్ 17) హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగే సమావేశం అనంతరం ఆయన తన రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిసింది. ఇదే సమయంలో తన వెంట ఉండే వారి జాబితాను కూడా తేలుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Teenmar Mallanna: బీసీల ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడిస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఈ తెలంగాణ గడ్డపైన బీసీలు సొంతంగా రాజకీయ పార్టీని నడపాలని, ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలని మల్లన్న ఆకాంక్షించారు. బీసీల ఉద్ధరణే తన ముఖ్య ఎజెండా అని, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమానికి విశేష ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు.
Teenmar Mallanna: బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలను ఆయా పార్టీలు ఎలా మోసం చేశాయో లెక్కలతో సహా చెప్తానని చెప్పారు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీ విధి విధానాలను ఈ సందర్భంగా ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని ప్రకటిస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.