Dasara Halidays: రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పండుగ సెలవులు సందడి తేనున్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవుల తేదీలను ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఇప్పటి నుంచే ఆనందంలో తేలియాడుతున్నారు. సెలవుల సమయాల్లో చేసే ఎంజాయ్‌ను తలచుకొని మురిసిపోతున్నారు. కానీ, టీచర్లు బండెడు హోంవర్క్ ఇవ్వడంతో ఉసూరుమంటున్నారు. ఉపాధ్యాయులు సైతం ఆనందంతో మురిసిపోతున్నారు.
Dasara Halidays: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 9 రోజులపాటు పాఠశాలలల విద్యార్థులకు ఈ దసరా సెలవులను ఇచ్చారు. ఈ గుడ్ న్యూస్‌తో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. మళ్లీ అక్టోబర్ 3 నుంచి పాఠశాలలను తిరిగి పునఃప్రారంభిస్తారు.
Dasara Halidays: అదే విధంగా తెలంగాణలో ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 13 రోజుల పాటు అధికారికంగా సెలవులను ప్రకటించింది. వచ్చే నెల 4న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించడంతో సంక్షేమ, ప్రైవేటు హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లి హ్యాపీగా పండుగ సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.