KTR Thanks To Jagan

KTR Thanks To Jagan: కష్టం కేటీఆర్‌దే అయినా.. క్రెడిట్‌ జగన్‌దే..!!

KTR Thanks To Jagan: తెలంగాణలోని మహబూబ్‌నగర్ వద్ద అమరరాజా సంస్థ నిర్మిస్తున్న గిగా ఫ్యాక్టరీ పురోగతి ఫోటోలను షేర్ చేస్తూ… తమ హయాంలో తెలంగాణకు భారీ పరిశ్రమలు వచ్చాయని చెప్పుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమరరాజా వంటి పరిశ్రమలు వేగంగా గ్రౌండ్ అవుతున్నాయని, ఈ విజయంలో తన పాత్ర ఎంతో కీలకం అన్నట్లుగా తనకి తానే కితాబిచ్చుకున్నారు. కానీ, ఈ పరిశ్రమ తెలంగాణకు రావడానికి అసలు కారణం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డే అని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి జగన్ పుణ్యమా అని అమర్ రాజా కంపెనీ తెలంగాణకు వచ్చిన విషయం బహిరంగ రహస్యమే. ఇప్పుడు కేటీఆర్ మాటలు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి… ఏపీ కంటే తెలంగాణ సమాజానికి ఎక్కువగా ప్రయోజనాలు చేకూర్చారు అన్నట్లుగా ఉన్నాయ్‌.

అప్పుడెప్పుడో చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీని ఏర్పాటు చేశారు పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర రావు. సొంత ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని.. తమ ప్రాంత అభివృద్ధిలో స్వయంగా భాగస్వామ్యం కావాలని అమెరికాలో మంచి భవిష్యత్‌ను వదులుకుని ఉన్నదంతా అమ్మేసుకుని చిత్తూరు వచ్చి పరిశ్రమలు పెట్టారు. దీంతో రాయలసీమలో వేలాదిమందికి ఉపాధి దక్కింది. అమర్ రాజా కంపెనీ దేశీయంగా కూడా గుర్తింపు సాధించింది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుంది. దీంతో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు అమరరాజాకు సానుకూల విధానాలతో మద్దతిస్తూ వస్తున్నాయి.

Also Read: TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.!

కానీ, జగన్ హయాంలో రాజకీయ కక్ష సాధింపులతో అమరరాజా కంపెనీని టార్గెట్ చేశారు. గల్లా కుటుంబం టీడీపీ వైపు మొగ్గడంతో, జగన్ తనిఖీల పేరిట ఇబ్బందులు సృష్టించారు. 10 వేల కోట్ల పెట్టుబడితో చిత్తూరులో విస్తరణకు సిద్ధమైన అమరరాజా, జగన్ వైఖరితో వెనక్కి తగ్గింది. ఈ పరిస్థితిని అవకాశంగా మలచుకున్న కేసీఆర్ ప్రభుత్వం, అమరరాజాను తెలంగాణకు ఆహ్వానించి, సౌకర్యాలు, రాయితీలు అందించింది. ఫలితంగా, అమరరాజా చిత్తూరును వదిలి మహబూబ్‌నగర్‌కు చేరింది. ఈ విజయాన్ని కేటీఆర్ తన ఖాతాలో వేసుకున్నా, జగన్ వైఫల్యమే దీనికి కారణమన్నది బహిరంగ రహస్యం. జగన్ రాజకీయ దుర్మార్గం వల్ల ఏపీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోగా, తెలంగాణకు లాభం చేకూరింది. జగన్ నీలి నీడలు పడకుండా ఉండి ఉంటే… అమరరాజా చిత్తూరులోనే బ్రహ్మాండంగా విస్తరించేదని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *