Mana ShankaraVaraprasad Garu

Mana ShankaraVaraprasad Garu: మన శంకర్ వరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్?

Mana ShankaraVaraprasad Garu: సినీ ప్రియులకు శుభవార్త! మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి మొదటి సింగిల్ రిలీజ్ గురించి హాట్ టాక్ నడుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ పాట విడుదల కానుందని టాక్. ఇది రొమాంటిక్ ట్రాక్ అని, గతంలో వచ్చిన ‘గోదారి గట్టు మీద’ పాట తరహాలో ఉంటుందని సమాచారం. ఈ సినిమా కథ, నటీనటుల కెమిస్ట్రీ, గోదావరి విజువల్స్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌ను అందించనున్నాయని చెబుతున్నారు. అలాగే, ఈ చిత్రంలోని ఇతర పాటలు, ట్రైలర్ వంటి మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌లు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read: #AA22XA6: అమెరికా టు అబుదాబి!

సంక్రాంతి విడుదలకు సిద్ధం: 

శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. అనిల్, మెగాస్టార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్‌తో నిండిన ఒక పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని టాక్. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *