Mahabubnagar:

Mahabubnagar: రెవెన్యూ అధికారుల వేధింపుల‌తో ఆటో డ్రైవ‌ర్ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Mahabubnagar: లంచం ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారుల వేధింపుల‌తో ఏకంగా ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. త‌న ఆటోకు నిప్పంటించి త‌న‌తోపాటు కుటుంబం స‌హా ఆటో డ్రైవ‌ర్ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న‌ది. స్థానికులు వారించి మంట‌ల‌ను ఆర్పి వారిని ర‌క్షించ‌డంతో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఆటో డ్రైవ‌ర్ శంక‌ర్‌కు మాత్రం కాలిన గాయాల‌య్యాయి.

Mahabubnagar: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర మండ‌లం బస్వాయిప‌ల్లిలో ఆటో డ్రైవ‌ర్ శంక‌ర్‌ తాత పేరిట 1.28 ఎక‌రాల ఇనాం భూమి ఉన్న‌ది. దానిని త‌న పేరుపై మార్చుకునేందుకు దేవ‌ర‌క‌ద్ర త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీవో కార్యాల‌యానికి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు వెళ్లింది. అయితే అక్క‌డి సిబ్బంది ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తు త‌మ‌కు అంద‌లేద‌ని తెలిపారు.

Mahabubnagar: ఎందుకు రాలేద‌ని తెలుసుకునేందుకు త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి వెళ్ల‌గా, అది పంపాలంటే రూ.15 వేలు ఇవ్వాలంటూ అక్క‌డ ప‌నిచేసే ఆర్ఐ సాహ‌త్ డిమాండ్ చేశాడ‌ని శంక‌ర్ ఆరోపించారు. త‌న వ‌ద్ద అంతలేద‌ని రూ.5 వేలు ఇచ్చాన‌ని, కానీ మిగ‌తా సొమ్ము ఇస్తేనే ద‌ర‌ఖాస్తును పంపుతానంటూ అధికారులు మొండికేశార‌ని శంక‌ర్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఎన్నిసార్లు కోరినా మిగ‌తా లంచం ఇవ్వందే ప‌నిచేయ‌న‌ని తేల్చి చెప్తున్నార‌ని చెప్పారు.

Mahabubnagar: రెవెన్యూ అధికారుల లంచం వేధింపుల‌తో ఆటో డ్రైవర్‌ శంక‌ర్ మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. న‌డిరోడ్డుపై ఆటోను నిలిపి.. త‌న భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెల‌ను ఆటోలో కూర్చొబెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ లోగా స్థానికులు మంట‌ల‌ను ఆర్పి వారిని కాపాడారు. శంక‌ర్ చేతుల‌కు కాలిన గాయాలు కాగా, ఆటో కాలిపోయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *