Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంతాల వీధి దీపాల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై వీధి దీపాల ఏర్పాటు, కొత్త ఎల్ఈడీ లైట్లు అమర్చడం, వాటి నిర్వహణ బాధ్యతలు సర్పంచులు, పంచాయతీలకే చెందనున్నాయి. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే ఎల్ఈడీ లైట్లు మండలస్థాయి ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండగా, జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
అదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వీధి దీపాలకే ప్రతి నెలా రూ.8 కోట్ల విద్యుత్ బిల్లు వస్తోందని, దీనికి ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ వినియోగాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఒకవైపు గ్రామాలు సక్రమంగా వెలుగులో మునిగిపోతే, మరోవైపు విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.