Crime News: పిల్లలను పెంచడం తల్లిదండ్రులు కి భారం కాదు. తండ్రికి భారంగా అనిపించినా తల్లికి ఆలా ఉండదు.. నవమాసాలు మోసి కంటుంది కదా ప్రేమ కొంత ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఊహ వచ్చేంత వరకు వాళ్లకి ఇంట్లోవాళ్లతో అవసరం ఉంటుంది. పిల్లలు తమ కాళ్ళ మీద వాళ్ళు నిల్లబడగలరు అనే నమ్మకం వచ్చిన తర్వాత చూసుకుంటారు. కానీ వాళ్లకు పుట్టిన పిల్లలకు శరీరం పెరుగుతుంది కానీ మెదడు పెరగకపోతే అపుడు ఎంత వయసు వచ్చిన తల్లి తండ్రులుపైనే ఆధారపడవలసి ఉంటుంది. దింతో కొడుకు శారీరక సమస్యలతో బాధపడుతుంటే అతని కోసం తల్లి కోవతిలా కరిగిపోతుంది. ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయించిన ఫలితం లేకపోవడం. వారికోసం భర్త పడుతున్న కష్టని చూసి తట్టుకోలేక.. ఈ తల్లి ఓ నిర్ణయం తీసుకుంది మానసిక వికలాంగుడైన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుండి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఈ విషాద ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే?
సాక్షి చావ్లా అనే మహిళ తన భర్త దర్పణ్ చావ్లా (చార్టర్డ్ అకౌంటెంట్), కుమారుడు దక్ష (11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తోంది. పుట్టినప్పటి నుంచే దక్షకు మానసిక ఎదుగుదల లోపించడంతో ఎన్నో ఖరీదైన చికిత్సలు చేయించినా ఫలితం లేకపోయింది. కొడుకు పరిస్థితి మెరుగుపడకపోవడంతో సాక్షి తీవ్ర మనోవేదనలో మునిగిపోయింది.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం సాక్షి తన కుమారుడిని తీసుకుని అపార్ట్మెంట్ 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో భర్త దర్పణ్ ఇంట్లో ఉన్నప్పటికీ వేరే గదిలో ఉండటంతో ప్రమాదాన్ని నివారించలేకపోయాడు. భార్య–కొడుకు కేకలు విని పరుగెత్తి వచ్చినప్పటికీ అప్పటికే వారిద్దరూ నేలపై కుప్పకూలి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
సూసైడ్ నోట్
సాక్షి తన మరణానికి ముందు ఒక సూసైడ్ నోట్ రాసింది. అందులో “మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాము. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం. మా మరణానికి ఎవరూ బాధ్యులు కాదు. భర్త ఎన్నో కష్టాలు పడుతుండటంతో అతనిపై భారమవ్వకూడదనిపించింది” అని పేర్కొంది.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సెంట్రల్ నోయిడా డీసీపీ శక్తి అవస్థి తెలిపారు.
సామాజిక సందేశం
ఈ ఘటన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. దీర్ఘకాలిక మానసిక సమస్యలతో పిల్లలను సంరక్షించడం తల్లిదండ్రులకు ఎంతటి భారంగా మారుతుందో దీనితో బయటపడుతోంది. ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలకు వైద్య సహాయం మాత్రమే కాదు, సామాజిక మద్దతు కూడా అత్యవసరం.