AP Mega DSC

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ.. తుది ఎంపిక జాబితా విడుదల

AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ – 2025 తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ అధికారులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు.

ఇకపై 16,347 టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి అయినట్లయింది. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) కార్యాలయాలు, కలెక్టరేట్‌లు, అలాగే అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో తుది ఎంపిక లిస్ట్‌ను అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు.

నియామక ప్రక్రియ వివరాలు

  • ప్రకటన విడుదల: ఏప్రిల్ 20, 2025

  • అభ్యర్థుల దరఖాస్తులు: 3,36,300 మంది అభ్యర్థులు – 5,77,675 అప్లికేషన్లు

  • పరీక్షలు: జూన్ 6 నుండి జూలై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు

  • ప్రైమరీ కీ: జూలై 5న విడుదల

  • ఫైనల్ కీ: ఆగస్టు 1న ప్రకటించారు

  • సర్టిఫికేట్ వెరిఫికేషన్: ఆగస్టు నెలలో పూర్తయింది

అన్ని దశలు ముగియడంతో తాజాగా తుది ఫలితాలను ప్రకటించి, ఎంపికైన అభ్యర్థులకు నియామక మార్గం సుగమం చేశారు.

మంత్రి లోకేష్ అభినందనలు

ఈ సందర్భంగా ఏపీ మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ ఎంపికైన అభ్యర్థులను హృదయపూర్వకంగా అభినందించారు. అభ్యర్థులు తమ ఎంపిక వివరాలను apdsc.apcfss.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *