Bigg Boss 9

Bigg Boss 9: ​బిగ్ బ్రేకింగ్.. బిగ్ బాస్ నుంచి ఆమె ఔట్?

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొదటి వారం ముగిసింది. మొదటి వారంలో మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారు సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్ ఉన్నారు.అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం, అత్యధిక ఓట్లు పొందినవారిలో తనూజ పుట్టస్వామి, సుమన్ శెట్టి , ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్లోరా షైనీ , శ్రష్టి వర్మ. చివరికి వీరిద్దరిలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు.మొదటి వారం హౌస్ కెప్టెన్‌గా సంజనా గల్రానీ ఎంపికయ్యారు. కెప్టెన్ అయినందున ఆమె నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. కాగా వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. హరీష్‌ను, ఓనర్లైన ప్రియ, శ్రీజల ప్రవర్తనను తప్పుపట్టారు. కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఈ సీజన్‌లో ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ అనే థీమ్ కొనసాగుతోంది. కామనర్స్ (సామాన్యులు) ‘ఓనర్స్’గా, సెలబ్రిటీలు ‘టెనెంట్స్’గా హౌస్‌లో ఉన్నారు. ఈ విభజన వల్ల హౌస్‌లో గొడవలు, డ్రామాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *