KTR

KTR: తల రైలు కింద పెడతానన్నాడు

KTR: బీఆర్ఎస్‌ (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గద్వాలను అభివృద్ధి చేసింది కేసీఆర్‌ (KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్‌ పాలనేనని, ఉమ్మడి పాలమూరును పచ్చగా మార్చింది కూడా బీఆర్ఎస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్‌లో చేరబోనని, కాంగ్రెస్‌లో చేరాల్సిన పరిస్థితి వస్తే తల రైలు కింద పెడతానని కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీకీ మద్దతుగా పనిచేస్తున్నారో అందరికీ స్పష్టమైందని అన్నారు.

ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ రాశి వారు అదృష్టాన్ని సంకలో పెటుకునాటే.. 12 రాశుల వారికి వారఫలాలు

ప్రజలు, కోర్టుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని గ్రహించిన ఆయన, మళ్లీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్‌లోనే ఉంటే, ఈ రోజు ఈ సభకు ఎందుకు రాలేదు? ప్రజలు అమాయకులు కారు. ఏది చెప్పినా నమ్మరని గమనించాలి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అలాగే, “ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గద్వాలలో ఉపఎన్నిక రావడం ఖాయం. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలవడం ఖాయం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా రాజీనామా చేయక తప్పదు” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *