Tailors: ఉత్తరప్రదేశ్ లో కొత్త నియమం అమలులోకి తీసుకువచ్చారు. మహిళల దుస్తుల కోసం కొలతలు తీసుకోవడంపై ప్రత్యేక నియమాన్ని రూపొందించారు. దీనిప్రకారం మహిళల దుస్తుల కోసం కొలతలను మహిళా టైలర్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. పురుష టైలర్లు మహిళల కొలతలు తీసుకోవడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా జిమ్‌లు, యోగా కేంద్రాల్లో కూడా పురుష ఇన్స్ట్రక్టర్స్ ఉండకూడదని కూడా ఆదేశాలు జరీ చేశారు. జిమ్‌లు, యోగా కేంద్రాల్లో తప్పనిసరిగా మహిళా శిక్షకులను నియమించుకోవాల్సి ఉంటుంది. సీసీటీవీ పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: CJI DY Chandrachud: కోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లాస్ట్ వర్కింగ్ డే.
కాన్పూర్ లో జరిగిన ఒక హత్యాచారం ఘటన తరువాత యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27 న, కాన్పూర్ DM ఆవాస్ క్యాంపస్‌లో ఒక వ్యాపారవేత్త భార్య మృతదేహం పూడ్చిపెట్టారు. ఆమెను 4 నెలల క్రితం జిమ్ ట్రైనర్ కిడ్నాప్ చేసి ఆ తర్వాత కారులో హత్య చేశాడు. నిందితుడు అజయ్ దేవగన్ చిత్రం దృశ్యం సినిమా సంఘటనల నుంచి ఈ ప్లాన్ చేశాడు. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. అక్టోబర్ 28న మహిళా కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు.