Perni Nani on Janasena: ఓ చోటా యూట్యూబ్ చానల్‌లో రెచ్చిపోయాడో ఆర్‌ఎంపీ డాక్టర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తిట్ల దండకం అందుకున్నాడు. అతడేదో తాగి వాగితే… ఆ బూతులను సెన్సార్ చేయకుండా వదిలింది సదరు యూట్యూబ్ చానల్. ఆ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ చేసింది వైసీపీ. దీనిపై ఆగ్రహించిన జనసైనికులు సదరు ఆర్‌ఎంపీ డాక్టర్ గిరిధర్ ఇంటి వద్ద ఆందోళన చేశారు. వారిలో కొందరు జనసైనికులు ఆర్‌ఎంపీ డాక్టర్‌కు ఫిజికల్‌గా ట్రీట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ ఘటనను క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగారు వైసీపీ నేత పేర్ని నాని. ఆర్‌ఎంపీ డాక్టర్ క్యాస్ట్‌ని లేవనెత్తుతూ జనసేనని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు.
Also Read: PM Modi: నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం.. మోదీ అభినందనలు
“చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి.. తర్వాతి రోజు ఏమీ తెలీనట్లు వెళ్లి ఏమైందంటూ మనమే పరామర్శించాలి…” ఇవీ పేర్ని నాని వైసీపీ కార్యకర్తలకు బోధించే సూక్తులు. పేర్ని నాని మాటల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాడేమో తెలీదు కానీ.. వైసీపీ సానుభూతిపరుడైన సదరు ఆర్‌ఎంపీ డాక్టర్.. ఓ చోటా యూట్యూబ్ చానల్ మైకు ముందు పెట్టగానే చడా మాడా మాట్లాడి చిక్కుల్లో పడ్డాడు. ఇప్పుడు అతన్ని పరామర్శించడానికి పేర్ని నాని పూనుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జన సైనికులు రెచ్చిపోతున్నారని, తనతో పాటు తన కుమారుడిని వెంటాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో పోలీసులు కలుగ చేసుకోవాలని.. లేకుంటే మున్ముందు జనసైనికులు మరింత రెచ్చిపోతారని చెబుతున్నారు. మొత్తానికి.. పేర్ని నాని చీకట్లో కన్నుకొట్టమంటే.. జనసైనికులు ఏకంగా చితక్కొట్టారని చెప్పాలి.
