Mahavathar Narasimha: యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. స్టార్ తారాగణం లేకపోయినా ఈ సినిమా భారీ విజయం సాధించింది. 50 రోజులు రికార్డు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ డివోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ థియేటర్లలో బలంగా నడుస్తున్న ఈ చిత్రం ఎన్నో రికార్డులు నమోదు చేసింది. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Breaking: రాజకీయాల్లోకి ఎంట్రీ పై బ్రహ్మానందం కీలక వ్యాఖ్యలు
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ చిత్రం 300 కోట్లకు పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదలైంది. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ సినిమా 200 థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. చాలా కాలం తర్వాత ఇంత లాంగ్ రన్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం కూడా థియేటర్లలో బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది.

