Nepal Prisoners Escape:నేపాల్ దేశంలో అల్లర్లు ఇంకా సద్దుమణగలేదు. ఆందోళనలను చల్లార్చేందుకు ఒకవైపు ఆర్మీ దేశమంతా కర్ఫూ విధించగా, దేశంలోని వివిధ జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పరారయ్యారు. భద్రతా సిబ్బందితో ఘర్షణ పడి మరీ ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటనతో దేశమంతా అట్టుడుకుతున్నది. ప్రత్యర్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఇళ్లు విడిచి వెళ్లిపోయారు.
Nepal Prisoners Escape:దేశంలోని పలు జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి సుమారు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. చిట్వాన్, రాజ్‌బిరాజ్, నక్కూ, ఝంప్కా, కైలాలీ, ఢిల్లీ బజార్, జాలేశ్వర్ తదితర జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పరారయ్యారు. నౌబస్తా బాలసదనం నుంచి 76 మంది మైనర్ నేరస్తులు పరారయ్యారు. ఈ పరిణామాలతో అంతటా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Nepal Prisoners Escape:నౌబస్తా బాలసదనంలో భద్రతా సిబ్బందితో అందులోని మైనర్లయిన నేరస్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు చనిపోయారు. పారిపోతుండగా ఐదుగురు ఖైదీలను సిద్ధార్థనగర్ జిల్లాలో భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఎస్ఎస్బీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తమ చేతుల్లోంచి ఆయుధాలను లాక్కొని ఖైదీలు పారిపోతుండగా, కాల్పులు జరిపినట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. ఆయా ఘటనలతో నేపాల్ దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు దాపురించాయి. ఆయా ఘటనలతో దేశం అట్టుడుకుతున్నది.
Nepal Prisoners Escape:సుంధూలిఘఢి జైలు నుంచి 43 మంది మహిళా ఖైదీలు సహా 471 మంది పరారయ్యారని అధికారులే తెలిపారు. జైలులో నిప్పుపెట్టి, భద్రతా దళాలను భయపెట్టి వారంతా తప్పించుకున్నారని తెలిపారు. అదే విధంగా ఢిల్లీ బజార్ జైలు నుంచి తప్పించుకోబోయిన ఓ ఖైదీని స్థానికులు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. నవాల్ పరాసీ వెస్ట్ జిల్లా జైలు నుంచి 500 మంది తప్పించుకున్నారు.