Hyderabad: రాష్ట్రంలో ఒకేరోజు పిడుగుపాటుకు గురై ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది.
📍 నిర్మల్ జిల్లా ఘటన
నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో: రైతు ఎల్లయ్య ఆయన భార్య ఎల్లవ్వ, రైతు కూలీ వెంకటి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
📍 జోగులాంబ గద్వాల జిల్లా ఘటన
ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో కూడా బుధవారం సాయంత్రం పిడుగుపాటు సంభవించింది.ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా,మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
⚠️ ఒకేరోజు విషాదం
ఈ రెండు వేర్వేరు సంఘటనల్లో కలిపి ఆరుగురు మృతి చెందగా, నలుగురు గాయపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
👉 అధికారులు రైతులు, కూలీలు వర్షాకాలంలో పొలాల్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వర్షం, పిడుగులు పడుతున్న సమయంలో చెట్ల కింద నిలవకుండా, పొలాల్లో ఎక్కువసేపు గడపవద్దని సూచిస్తున్నారు.