Amaravati: గుడ్ న్యూస్ ఆటో డ్రైవర్లకు 15000..

Amaravati: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Journey) స్కీమ్‌ అమలులోకి రావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటోడ్రైవర్లు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కల్పించే నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, దసరా నుంచి ‘వాహన మిత్ర’ (Vahana Mithra) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉన్నప్పటికీ, ఆ కారణంగా తమకు బాడుగలు తగ్గి నష్టపోతున్నారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పిస్తూ ‘వాహన మిత్ర’ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సహాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vishnu Kumar: రుషికొండ ప్యాలెస్‌లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *