Deepika Padukone: బాలీవుడ్ టాప్ జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ తమ కూతురు దువా మొదటి పుట్టినరోజు వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లల పుట్టినరోజులకు పెద్ద పార్టీలు ఇస్తుంటారు, కానీ దీపికా మాత్రం తన ప్రత్యేకతను చాటుతూ చాలా సింపుల్‌గా, ప్రేమతో నిండిన వాతావరణంలో ఈ వేడుకను నిర్వహించారు.
సెప్టెంబర్ 9న జరిగిన ఈ వేడుకకు సంబంధించి, దీపికా స్వయంగా తన కూతురి కోసం ఒక కేక్ తయారు చేశారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పంచుకున్నారు. “నా ప్రేమ భాష? నా కుమార్తె 1వ పుట్టినరోజు కోసం కేక్ చేయడం!” అంటూ చాక్లెట్ కేక్ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. కేవలం రెండు గంటల్లోనే ఐదు లక్షలకు పైగా లైక్స్ సాధించింది.
Also Read: Varun tej – Lavanya Tripathi: తండ్రైన వరుణ్ తేజ్.. మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
దీపికా, రణ్‌వీర్ సింగ్ దంపతులు 2018లో పెళ్లి చేసుకున్నారు. 2024 సెప్టెంబర్ 8న వారికి కూతురు జన్మించింది. గత దీపావళికి తమ కూతురికి దువా అని పేరు పెట్టినప్పుడు, వారు ‘దువా’ అంటే ‘ప్రార్థన’ అని, తమ ప్రార్థనలకు ఆమె సమాధానం అని ఎమోషనల్‌గా వివరించారు. ఇప్పుడు ఆమె మొదటి పుట్టినరోజు సందర్భంగా దీపికా స్వయంగా కేక్ తయారు చేసి, ఆ ప్రేమను మరోసారి చాటారు.
ఈ పోస్ట్‌పై సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు. నటీనటులైన బిపాషా బసు, కాజల్ అగర్వాల్, భూమి పడ్నేకర్ వంటి వారు దువాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు అయితే “స్వీట్ మదర్ నుండి స్వీట్ బేబీకి స్వీట్ కేక్”, “దీపికా, మీరే స్వయంగా కేక్ చేశారా!?” అంటూ ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఒక స్టార్‌కి, ఆమె తల్లి ప్రేమకు మధ్య ఉన్న బంధాన్ని సూచించింది.
View this post on Instagram