Malla Reddy Big Plan: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సినీ సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఏపీ అభివృద్ధి, అక్కడి సీఎం పని తీరుపై వ్యాఖ్యలు చేయడం, ప్రశంసించడం కామన్. కానీ ఆ పని చేసింది తెలంగాణ మల్లారెడ్డి అయితే అది ప్రత్యేకం. మోడీ పాలనను ప్రశంసిస్తూ, చంద్రబాబు అభివృద్ధిని కీర్తిస్తూ.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలో అభివృద్ధిని కంపేర్ చేస్తూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపుతున్నాయి. మల్లారెడ్డి వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో అయినా.. తెలంగాణలోని బీఆర్‌ఎస్ భవన్‌లో సెగలు పుట్టిస్తున్నాయి. మల్లన్న పైకి కమెడియన్‌లా కనబడినా, లోపల చాలా సీరియస్ పొలిటీషియన్. మరి ఏ మతలబు లేకుండా కేసీఆర్ శత్రువును పొగడరు కదా? మరి మల్లన్న మాటల వెనక ఆ మతలబు ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ.
తిరుమల వెంకన్న దర్శనం తర్వాత తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోందని, దీనికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వమే కారణమని మల్లారెడ్డి కితాబిచ్చారు. ప్రధాని మోదీ లక్షల కోట్ల రూపాయలను ఏపీకి కేటాయిస్తుంటే, చంద్రబాబు ఆ నిధులను సమర్థంగా వినియోగిస్తూ అభివృద్ధి యంత్రాన్ని టర్బో మోడ్‌లో నడిపిస్తున్నారని పొగిడారు. ప్రభుత్వ ప్రాజెక్టులతో పాటు, పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల విస్తరణలో ఏపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అటు ఇటు తిరిగి తెలంగాణను టార్గెట్ చేశారు మల్లారెడ్డి! కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో అభివృద్ధిని సాధించినప్పటికీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్ కుదేలవుతోందన్నారు. ఒకప్పుడు ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆస్తులు కొనేవారని, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలే ఏపీలో ఇన్వెస్ట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ రెండు రాష్ట్రాల ఆర్థిక, రాజకీయ దిశలను పోల్చి చూపించే స్మార్ట్ మూవ్‌గా కనిపిస్తోంది.
Also Read: Revanth Reddy: ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
మల్లారెడ్డి వ్యాఖ్యలు సర్ఫేస్‌లో సింపుల్‌గా కనిపించినా, వాటి వెనక డీప్ పొలిటికల్ గేమ్ ఉంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వాన్ని, మోదీ-చంద్రబాబు కాంబోను పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా కేంద్రంతో సన్నిహితత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు, తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై చురకలేస్తూ, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పాత గోల్డెన్ డేస్ తిరిగొస్తాయని సూచనప్రాయంగా సిగ్నల్ ఇచ్చారు. ఈ పొగడ్తలు, చురకల మిక్స్‌తో మల్లారెడ్డి తెలంగాణ రాజకీయ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయ్యారు. తిరుమల సన్నిధిలో వేసిన ఈ పొలిటికల్ పంచ్‌లు కేవలం మల్లన్న రెగ్యులర్ డైలాగులు కాదని, ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. మరి ఇంతకీ మల్లన్న మాస్టర్ ప్లాన్ ఏమిటి? ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు కొత్త ఊపు తెస్తాయా, లేక కొత్త రాజకీయ సమీకరణలకు నాంది పలుకుతాయా? వెయిట్ అండ్ వాచ్!