Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పాటించకుండా అడ్డదిడ్డంగా వెళ్లే వారు అధికంగానే ఉంటారు. కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను తమ ఇష్టారీతిన నడుపుతూ ఇతరులకు హాని కలిగిస్తుంటారు. పోలీసుల తనిఖీలకు కూడా సహకరించకుండా కొందరు దర్పం ప్రదర్శిస్తూ ఉంటుంటారు. మరికొందరు పలాయనం చిత్తగిస్తుంటారు. అలాంటి కోవలోకే ఈ కారు డ్రైవర్ వస్తాడు.
పంజాగుట్ట సమీపంలో ప్రధాన హైవేపై శుక్రవారం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసులపైకే కారు దూసుకొచ్చింది. ఆపేందుకు ఓ హోంగార్డు కారుకు అడ్డుగా వెళ్లినా ఆపకుండా కారు డ్రైవర్ ముందుకే పోనిచ్చాడు. ముందుగా ఉన్న ఆ హోంగార్డును కారుతో సహా ఈడ్చుకెళ్లాడు. చాలా దూరం వరకు ముందు ఉన్న హోంగార్డు కారును ఆపాలని వారించినా వినిపించుకోలేదు.
ఇది కూడా చదవండి: KTR: నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చు
దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపట్లోనే సదరు కారు డ్రైవర్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. కారును ఆపకుండా బీభత్సం చేయడంపై స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఇతర వాహనదారులు కూడా ఆందోళనకు గురయ్యారు.

