Kerala:

Kerala: ప్లాస్టిక్ నివార‌ణ‌లో కేర‌ళ‌లో వినూత్న కార్య‌క్ర‌మం.. నేటి నుంచే అమ‌లు

Kerala: కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించ‌డంలో ఈ వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఖాళీ ప్లాస్టిక్ మ‌ద్యం బాటిళ్ల‌ను సేక‌రించేందుకు ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ఇది ఈ రోజు (సెప్టెంబ‌ర్ 10) నుంచే అమ‌లులోకి రానున్న‌ది. రాష్ట్ర బెవ‌రేజెస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఆధ్వ‌ర్య‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టేందుకు నిర్ణ‌యించింది.

Kerala: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ మ‌ద్యం ప్లాస్టిక్ బాటిల్‌ను వెన‌క్కి ఇచ్చిన‌ట్టయితే రిఫండ‌బుల్ డిపాజిట్ కింద వ‌సూలు చేసి రూ.20ను తిరిగి ఇవ్వ‌నున్న‌ది. ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశించిన కౌంట‌ర్ల‌లో వీటిని సేక‌రించేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలి విడ‌త‌లో 20 కేంద్రాల్లో అమ‌లు చేయ‌నున్నారు. తిరువ‌నంత‌పురంలో 10, క‌న్నూరు జిల్లాలో మ‌రో 10 కేంద్రాల‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు.

Kerala: బాటిళ్ల‌పై ప్ర‌త్యేక ముద్రించిన క్యూఆర్ కోడ్ లేబుల్ ద్వారా మ‌ద్యం ఖాళీ బాటిళ్లుగా గుర్తించ‌నున్న‌ట్టు బెవ‌రేజెస్ కార్పొరేష‌న్ సంస్థ వెల్ల‌డించింది. బాటిళ్ల సేక‌ర‌ణ కేంద్రాల‌ను వ‌చ్చే జ‌న‌వ‌రి 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కేంద్రాల‌కు విస్త‌రించాల‌ని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ఆ సంస్థ పేర్కొన్న‌ది. ఈ ప్లాస్టిక్ బాటిళ్ల సేక‌ర‌ణ‌ను మ‌హిళా సంఘాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. వారానికి మూడు రోజుల‌పాటు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *