Nara Lokesh: నేపాల్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. అనంతపురంలో జరగాల్సిన ‘సూపర్‌సిక్స్.. సూపర్‌హిట్’ సభకు ఆయన హాజరుకావడం లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు
మంత్రి నారా లోకేష్ ఈరోజు సచివాలయానికి వెళ్లి, రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్‌రూమ్‌ను పర్యవేక్షించనున్నారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు.
మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్
* నేపాల్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాసుల వివరాలు తెలియజేయడానికి, వారి కుటుంబ సభ్యుల కోసం ఒక ప్రత్యేక కాల్ సెంటర్‌ను, వాట్సప్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.
* ఈ వివరాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయనున్నారు.
* నేపాల్‌లోని తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

