Vijayawada Sri kanaka durga temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 11 రోజుల పాటు అమ్మవారు 11 అలంకారాలలో దర్శనమిస్తారు. త్రిమాత స్వరూపమైన దుర్గాదేవి.. తెలుగు భక్తుల వైభవానికి ప్రతీకగా, తెలుగింటి ఆడపడుచుగా కొలువై ఉన్నది. మహాశక్తి స్వరూపిణిగా ఈ తెలుగు నేలపై మహిమాణ్వితంగా విశేష పూజలందుకుంటున్నది.
Vijayawada Sri kanaka durga temple: సెప్టెంబర్ 22న నవరాత్రి తొలిరోజున అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనభాగ్యం ఉంటుంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. మహామండపంలోని 6వ అంతస్తులో కుంకుమార్చనలు, దేవీ ఖడ్గమాలార్చనలు, శ్రీ చక్ర నవార్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. యాగశాలలో చండీ హోమం ప్రతిరోజూ జరుగుతుంది.
Vijayawada Sri kanaka durga temple: సెప్టెంబర్ 29న అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కనుక ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. అదేరోజున మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. దసరా మహోత్సవాలలో ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో ఆది దంపతుల నగరోత్సవం నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉంటాయి.
అమ్మవారి అలంకారాలు
తేదీ (సెప్టెంబర్) అలంకారం
22 శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి
23 శ్రీ గాయత్రీదేవి
24 శ్రీ అన్నపూర్ణాదేవి
25 శ్రీ కాత్యాయని దేవి
26 శ్రీ మహాలక్ష్మీ దేవి
27 శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి
28 శ్రీ మహాచండీ దేవి
29 శ్రీ సరస్వతీ దేవి
30 శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 1 శ్రీ మహిషాసురమర్ధిని దేవీ
అక్టోబర్ 2 శ్రీ రాజరాజేశ్వరీ దేవి

