Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. గోబెల్స్‌ను మించిపోయేలా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు రావడం కేవలం మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టు, గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును రేవంత్ స్వయంగా వ్యతిరేకించి 48 గంటల దీక్ష కూడా చేశారు.
“అప్పుడు వ్యతిరేకించి, ఇప్పుడు దాన్నే తమ కృతిగా చూపించుకోవడం ఎంతవరకు సమంజసం?” అని హరీష్‌రావు ప్రశ్నించారు.