Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) మరణించిన మూడు నెలల తర్వాత, పార్టీ తన కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. కరీంనగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని పార్టీ కొత్త సెక్రటరీగా నియమించినట్లు మావోయిస్టులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది మే నెలలో ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరియు భద్రతా బలగాల మధ్య జరిగిన తీవ్రమైన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ మృతుల్లో నంబాల కేశవరావు కూడా ఉన్నారని అధికారులు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9 Telugu: ఆట మొదలు పెట్టిన బిగ్ బాస్.. ఓనర్లు టెనెంట్స్ మధ్య గొడవ..!
అతనిపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు కూడా ప్రకటించబడి ఉండగా, ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించారు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పుట్టినిల్లు అయిన నంబాల కేశవరావు నలుగుదిశలా మావోయిస్టు ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన కీలక నేతల్లో ఒకరుగా పరిగణించబడ్డారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు పార్టీ దేవుజీని సెక్రటరీగా నియమించడం మావోయిస్టు శ్రేణుల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

