Gold Price Today: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్య ప్రజలకు వాటిని కొనడం కష్టంగా మారింది. ముఖ్యంగా, బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి, లక్షా 10 వేల మార్కును దాటాయి. వెండి కూడా అదే బాటలో పరుగులు పెడుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 9, 2025) ఒక్కరోజే ఈ ధరలు భారీగా పెరిగాయి.
ఒక్కరోజే పెరిగిన ధరలు
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,360 పెరిగి రూ.1,10,290కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,250 పెరిగి రూ.1,01,100కి చేరుకుంది. అటు వెండి కూడా కిలోపై రూ.3,000 పెరిగి రూ.1,30,000కి చేరింది.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
* హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,10,290, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,100. వెండి కిలో ధర రూ.1,40,000.
* విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,10,290, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,100. వెండి కిలో ధర రూ.1,40,000.
* ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ.1,10,440, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,250. వెండి కిలో ధర రూ.1,30,000.
* ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ.1,10,290, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,100. వెండి కిలో ధర రూ.1,30,000.
* చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ.1,10,730, 22 క్యారెట్ల బంగారం రూ.1,01,500. వెండి కిలో ధర రూ.1,40,000.
ముందు ముందు మరింత పెరిగే అవకాశం
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. గత రెండు నెలలుగా ధరలు తగ్గుముఖం పట్టకుండా నిలకడగా పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, మరియు రాజకీయ అనిశ్చితి వంటి అనేక అంశాలు కారణమని చెబుతున్నారు.

