Viral Video

Viral Video: పోలీస్ కానిస్టేబుల్‌కు గణేశుడి బహుమతి.. ఏంటి అంటే?

Viral Video: సాధారణంగా పోలీస్ అంటే ప్రజల రక్షణ బాధ్యతలే గుర్తుకొస్తాయి. కష్టసుఖాలు, సంతోషాలు వారికి పెద్దగా ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ వారికీ ఒక మనసుంటుంది, ఆ మనసు ఎన్నో కష్టాలను దాటుకుని వస్తుంది. కష్టపడి పైకొచ్చిన వారికి అదృష్టం కూడా తోడైతే, ఆ సంతోషం వర్ణనాతీతం. అలాంటిదే హైదరాబాద్ లోని ఒక కానిస్టేబుల్ విషయంలో జరిగింది.

నగరంలోని ఒక గణేష్ మండపం వద్ద విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు ఊహించని అదృష్టం వరించింది. మండపం నిర్వాహకులు లాటరీ ద్వారా 121 గజాల ప్లాట్‌ను బహుమతిగా గెలుచుకున్నాడు. గణేష్ నిమజ్జనం రోజున ఈ లాటరీని నిర్వహించారు. విధులు నిర్వహిస్తున్న ఆ కానిస్టేబుల్ పేరును విజేతగా ప్రకటించారు. తన పేరు వినగానే ఆ కానిస్టేబుల్ ఆశ్చర్యపోయాడు. మండపం నిర్వాహకులతో పాటు, అక్కడున్న ప్రజలందరూ అతడిని అభినందించారు.

తన సంతోషాన్ని ఆపుకోలేక, ఆ కానిస్టేబుల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కంటతడి పెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానిస్టేబుల్ సంతోషాన్ని చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. కష్టపడేవారిని ఆ దేవుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడని ఈ సంఘటన రుజువు చేసింది. ఈ సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *