Warangal

Warangal: నా భార్య, ప్రియుడితో కలిసి నన్ను చంపాలని చూస్తుంది.. నన్ను రక్షించండి అంటున్న భర్త.. !

Warangal: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామ పరిధిలోని జగ్గుతండాలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భార్య తన ప్రియుడితో కలిసి తనను హత్య చేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేస్తూ బోనోత్ మహేష్ అనే గ్రామస్థుడు పోలీసులను ఆశ్రయించారు.

మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ ఎవరం చాల రోజుల నుండి జరుగుతూనే ఉంది. వాళ్ళ మధ్యలో ఎక్కడ నేను అడ్డు వస్తానేమో అని అనుకోని తనని హత్య చేయాలనీ ప్రయత్నించారు. తనపై ఇటీవల దాడి జరిగి తృటిలో తప్పించుకున్నానని మహేష్ తెలిపాడు. ఇది వరకే రెండు సార్లు తనని చంపాలి అని చూశారు అని. కానీ పంచాయితీలో కంప్రమైస్ చేశారు. అతని నుండి 20,000 కూడా నగదు తీసుకున్నారు అని వీడియో లో తెలిపారు.

బయటికి వచ్చి ప్రశాంతంగా కుడా తిరగలేక పోతున్నాను అని తెలిపారు. ఇటీవల చెరువు  దగ్గరికి వెళ్లినపుడు. కత్తి తీసుకోని వచ్చి హత్యా చేయడానికి ప్రయత్నించాడు. అతడిని చుసిన నా కొడుకు నాన్న అని గట్టిగా అరవడంతో వెనక్కి తెరిగి చూసి.. తుతిలో తపించుకున్నాను అన్నారు.

తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఈ ఘటన జరుగుతోందని ఆయన వివరించారు.

పర్వతగిరి పోలీసులు మహేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో జగ్గుతండా గ్రామంలో కలకలం రేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *