Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున రద్దయిన నోట్ల పట్టుబడి సంచలనంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో తనిఖీ జరపగా, దాదాపు రూ.2 కోట్ల విలువైన రద్దయిన పెద్ద నోట్లు బయటపడ్డాయి.
ఈ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి మరింత విచారణ చేపడుతున్నారు.