Telangana

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

Telangana: సరా పండుగ సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దసరా, బతుకమ్మ పండుగలకు కలిపి పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.

పాఠశాలలకు సెలవులు:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. మొత్తం 13 రోజుల పాటు సెలవులు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

జూనియర్ కళాశాలలకు సెలవులు:
జూనియర్ కళాశాలలకు కూడా విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ఉంటాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *