MLA Bandla Krishna Mohan Reddy: పార్టీ ఫిరాయింపుల అంశంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలనే రిపీట్ చేశారు. మూడు నెలల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ చర్యలను ప్రారంభించారు. ఈ దశలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన కొంతకాలం తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్‌కే నిర్ణయాన్ని వదిలేయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
MLA Bandla Krishna Mohan Reddy: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని విచారించిన సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ స్పీకర్‌ను ఆదేశించింది. ఆ ఆదేశాలతోనే స్పీకర్ స్పందించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆ 10 మందికి నోటీసులను జారీ చేశారు. దీనిపై గతంలో ఓసారి స్పందించిన బండ్ల మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
MLA Bandla Krishna Mohan Reddy: నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 37 మంది ఎమ్మెల్యేల్లో నేను ఒకటిని, నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. స్పీకర్ నోటీసులకు సాంకేతిక అంశాలతో సమాధానం ఇచ్చాను. ఫిరాయింపు ఆరోపణలకు బ్రేక్ పడుతుంది.. అని అనుకుంటున్నా.. అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
