Akshay Kumar: నిన్నటితో ముగిసిన గణపతి వేడుకలు.. చివరి రోజుకావడంతో గణపతికి వేడుకోలు చెప్పడానికి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. అలాగే నిన్న ముంబై గణపతి విసర్జన్ వేడుకల తర్వాత బీచ్‌లపై వేడుకల తరవాత పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం (సెప్టెంబర్ 7) ముంబైలోని జుహు బీచ్‌లో నిర్వహించిన భారీ క్లీనప్ డ్రైవ్‌లో ఆయన స్వయంగా పాల్గొని చెత్తను ఏరి సంచుల్లో నింపుతున్నాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రానీ కూడా పాల్గొని వాలంటీర్లతో కలిసి శ్రమించారు.
VIDEO | Mumbai: Actor Akshay Kumar (@akshaykumar) joins Amruta Fadnavis (@fadnavis_amruta), wife of Maharashtra CM Devendra Fadnavis, in a cleanliness drive at Juhu Beach.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/qYK2kHnESl
— Press Trust of India (@PTI_News) September 7, 2025
పరిశుభ్రత ప్రజా బాధ్యత.. అక్షయ్ కుమార్
కార్యక్రమం తర్వాత అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వానికే పరిమితం కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మనం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం దేశ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకువచ్చింది అని తెలిపారు.
అమృత ఫడ్నవీస్ కూడా ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, “పరిశుభ్రతపై ఈ స్థాయి చైతన్యం రావడం మోదీ గారి మార్గదర్శకత్వం వల్లే సాధ్యమైంది అని ఆమె అన్నారు.
ఇది కూడా చదవండి: Mirzapur The Film: మీర్జాపూర్ ది ఫిల్మ్‌లో ఊహించని ట్విస్ట్?
విసర్జనలతో పెరిగిన కాలుష్యం
ప్రతి సంవత్సరం గణపతి విసర్జనల తర్వాత ముంబై రోడ్లు, బీచ్‌లపై భారీగా ప్లాస్టిక్, పూలు, విగ్రహాల అవశేషాలు పేరుకుపోతాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనడంతో స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు కలిసి శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టారు. వీళ్లని చూసిన తర్వాత అయిన ప్రజల్లో మార్పు వచ్చి కొంతమంది ఐన వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకుంటేరేమో చూడాలి.
అక్షయ్ ప్రాజెక్టుల జాబితా
పని విషయంలో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన ‘భూత్ బంగ్లా’లో నటించబోతున్నారు. సునీల్ శెట్టి, పరేష్ రావల్‌లతో కలిసి ‘హేరా ఫేరి 3’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’, ‘హైవాన్’, ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ వంటి ప్రాజెక్టులు అయ్యా నా చేతిలో ఉన్నాయి.