Shreyas Iyer: ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో జరగబోయే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను ఇండియా-ఎ కెప్టెన్‌గా నియమించారు. ఆసియా కప్‌కు భారత సీనియర్ జట్టులో చోటు దక్కని శ్రేయస్‌కు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఈ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి లక్నోలో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా-ఎ జట్టు వివరాలు చూస్తే.. జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్) గా వ్యవహరించనున్నారు.
ఇది కూడా చదవండి: Bigg Boss 9 Telugu: ఇవాళ్టి నుంచి బిగ్ బాస్ సీజన్ 9.. కంటెస్టెంట్స్ ఎవరంటే?
దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ తరఫున నార్త్‌తో సెమీస్‌లో 197 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ కూడా అవకాశం అందుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దుబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ లకు చోటు దక్కింది. తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత కె.ఎల్. రాహుల్, మహ్మద్ సిరాజ్ రెండో మ్యాచ్ కోసం జట్టుతో చేరనున్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 16-19 తేదీల్లో జరుగుతుంది. 23-26 తేదీల్లో రెండో మ్యాచ్ నిర్వహిస్తారు.