BCCI

BCCI: ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. ఉత్కంఠకు తెర!

BCCI: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. త్వరలో యూఏఈలో జరగనున్న ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు : 
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆగస్టులో విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, భారత జట్టు శత్రుదేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడదు. అయితే, అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మరియు మల్టీనేషనల్ ఈవెంట్లలో మాత్రం అన్ని దేశాలతో పోటీ పడుతుంది.

Also Read: Ross Taylor: కివీస్‌ స్టార్‌ రాస్‌ టేలర్‌ మళ్లీ క్రికెట్‌లోకి.. ఈసారి ఆ జట్టు తరఫున!

బీసీసీఐ ప్రకటన : 
బీసీసీఐ ఎల్లప్పుడూ భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తుంది” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. మల్టీనేషనల్ టోర్నమెంట్లలో మన దేశంతో స్నేహపూర్వకంగా లేని దేశాలతో ఆడటంపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి టీమ్ ఇండియా ఇలాంటి టోర్నమెంట్లలో అన్ని మ్యాచ్‌లు ఆడుతుంది” అని తెలిపారు. ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్‌లు ఈ కోవలోకి వస్తాయి కాబట్టి, పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటం తప్పనిసరి అని ఆయన వివరించారు.

ఆసియా కప్ షెడ్యూల్ : 
ఆసియా కప్ సెప్టెంబర్ 9న అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 10న టీమిండియా యూఏఈతో తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది.

ఈ ప్రకటనతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *