Sukumar

Sukumar: సైమా అవార్డ్స్ లో సత్తా చాటిన పుష్ప 2.. పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Sukumar: తెలుగు సినిమా పుష్ప సినిమాలకి సప్రేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాతో పాటు ప్రపంచ దేశాలలో కూడా పుష్పరాజ్ మేనరిజం చేసేవాళ్ళు చల్ల మంది ఉన్నారు.. ప్రేక్షకుడి నుండి సెలబ్రిటీస్ వారికి అందరూ పుష్పరాజ్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయినవలె..పుష్ప 2 తర్వాత 3 వస్తుంది అని అనౌన్స్ చేసిన.. అల్లు అర్జున్ లైన్ అప్ చుసిన తర్వాత అసలు ఈ సినిమా ఉంటుందా అనే డౌటే అందరికి వచ్చింది.. ఈ వార్తలన్నిటికి సుకుమార్ చెక్ పెట్టారు. 

సైమా 2025లో సుకుమార్ పుష్ప 3 తప్పకుండ ఉంటుంది అని చెప్పుకొచ్చారు..  సైమా 2025 అవార్డ్స్ లో పుష్ప 2 తన సత్తా చాటింది.  బెస్ట్ డైరెక్టర్, బెస్ట్  యాక్టర్ మేల్,  బెస్ట్  యాక్టర్ ఫిమేల్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్, ఇలా 5 అవార్డ్స్ ఈ సినిమా సాధించింది. 

పుష్పా: ది రైజ్ (2021)

2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్పా: ది రైజ్ కోవిడ్‌ అనంతరం థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షించిన మొదటి భారీ చిత్రం. ఈ సినిమా ఓపెనింగ్‌ డేలోనే రూ.74 కోట్ల వరల్డ్‌వైడ్‌ వసూళ్లు సాధించింది. మొదటి వారాంతానికే రూ.107 కోట్ల నెట్‌ కలెక్షన్‌తో సెన్సేషన్ సృష్టించింది.

  • భారత్ గ్రాస్‌ కలెక్షన్: రూ.313.8 కోట్లు
  • ఓవర్సీస్‌ కలెక్షన్: రూ.36.3 కోట్లు
  • వరల్డ్‌వైడ్‌ కలెక్షన్: రూ.360–393.5 కోట్లు

పుష్పా: ది రైజ్ 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం మాత్రమే కాకుండా, అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిపెట్టింది. DSP మ్యూజిక్, “Srivalli”, “Oo Antava” వంటి పాటలు పాన్-ఇండియా స్థాయిలో వైరల్ అయ్యాయి.

పుష్పా 2: ది రూల్ (2024)

2024 డిసెంబర్ 5న విడుదలైన పుష్పా 2: ది రూల్ తొలి రోజే రికార్డు స్థాయిలో థియేటర్లను ఆక్రమించింది. ఓపెనింగ్ వీకెండ్‌లోనే రూ.433 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది.

  • భారత్ నెట్‌ కలెక్షన్ (Day 52): రూ.1,231.35 కోట్లు
  • భారత్ గ్రాస్‌ కలెక్షన్: రూ.1,467.2 కోట్లు
  • వరల్డ్‌వైడ్‌ కలెక్షన్: రూ.1,731–1,738 కోట్లు
  • Day 39 నాటికి: రూ.1,220 కోట్ల భారత్ నెట్‌ కలెక్షన్; ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్ల దిశగా

ఈ చిత్రం విడుదలైన మొదటి 3 వారాల్లోనే రూ.1,700 కోట్ల మార్క్ దాటింది. టాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ustaad Bhagat Singh: ఫిలిం ఫెడరేషన్ నాయకుల నిరసన.. పోలీస్ బందోబస్త్ మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ డే షూటింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *