Yadagirigutta Temple

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట ఆలయం మూసివేత.. మళ్ళీ తెరిచేది అప్పుడే..!

Yadagirigutta Temple: రేపు సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత, ఎల్లుండి (సోమవారం) తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం మళ్లీ తెరుచుకోనుంది.

ఇది కూడా చదవండి: Narendra Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటన రద్దు..! భారత్ తరపున ఎస్. జైశంకర్

చంద్రగ్రహణం రేపు రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగియనుంది. ఈ కారణంగా రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్ని దర్శనాలు, సేవలు, సత్యనారాయణ వ్రతాలు, వాహనపూజలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎల్లుండి తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తిరిగి తెరిచిన వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి యథావిధిగా నిత్య పూజలు, సేవలు చేపడతామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సమయంలో భక్తులు ఆలయ నియమ నిబంధనలను పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *