Balapur Laddu Auction: బాలాపూర్ గణేషుడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉన్నది. ఏకంగా దేశవ్యాప్తంగా కూడా బాలాపూర్ లడ్డూ వేలంపై ఆసక్తి కలుగుతుంది. చివరి రోజు ఉత్కంఠను కలిగించే ఈ వేలంపై తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారు కూడా ఆసక్తిని కనబరుస్తారు. 1994లో మొదలైన ఈ లడ్డూ వేలం 2025 వరకు పెరుగుతూ వచ్చింది. ఆ వివరాలు మహాన్యూస్ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
Balapur Laddu Auction: 1994లో తొలి వేలంలో కేవలం రూ.450 పలికింది. ఏటేటా లడ్డూ వేలం ధర పెరుగుతూ వచ్చింది. ఈ సారి కూడా భారీ ధర పలకడం విశేషం. ఏకంగా రూ.35 లక్షలకు లింగాల దశరథగౌడ్ ఆ లడ్డూను కైవసం చేసుకున్నారు. నిరుటి కంటే రూ.4.99 లక్షలు అదనంగా లడ్డూ ధర పలకడం విశేషం. దశరథగౌడ్ గతంలో ఐదేండ్లు వేలంలో పాల్గొన్నా లడ్డూ దక్కలేదు. ఆరోసారి వేలంలో ఆయన లడ్డూను దక్కించుకున్నారు.
1994 నుంచి 2025 వరకు లడ్డూల వేలం ధరలు ఇవే..
సంవత్సరం- వేలం ధర
1994 – 450
1995 4,500
1996 18,000
1997 28,000
1998 51,000
1999 65,000
2000 66,000
2001 85,000
2002 1,05,000
2003 1,55,000
2004 2,01,000
2005 2,08,000
2006 3,00,000
2007 4,15,000
2008 5,07,000
2009 5,10,000
2010 5,35,000
2011 5,45,000
2012 7,50,000
2013 9,26,000
2014 9,50,000
2015 10,32,000
2016 14,65,000
2017 15,60,000
2018 16,60,000
2019 17,60,000
2020 వేలం లేదు (సీఎంకు సమర్పణ)
2021 18,90,000
2022 24,60,000
2023 27,00,000
2024 30,01,000
2025 35,00,000