SIIMA Awards 2025: ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025 వేడుకలు ఈసారి దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగాయి. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్పో సిటీలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహోత్సవంలో సినీ తారల సందడి అదిరిపోయింది. తొలిరోజు తెలుగు చిత్రాలకు సంబంధించిన విభాగాల్లో అవార్డులు ప్రకటించగా, ప్రముఖులు, అభిమానుల హర్షధ్వనుల మధ్య పురస్కారాలను అందజేశారు.
టాలీవుడ్ తారల రాకతో ఈ వేడుకలకు మరో అందం చేకూరింది. ప్రముఖ నటీమణులు హాట్ డాన్స్ ప్రదర్శనలతో స్టేజ్‌ను కదిలించగా, అభిమానులు ఊర్రూతలూగిపోయారు.
ఉత్తమ చిత్రంగా ‘కల్కి’
ఈ ఏడాది తెలుగు సినిమా విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ ఎంపికైంది. ఈ సినిమాలోని విజువల్ ట్రీట్మెంట్, కథన శైలి, టెక్నికల్ బృందం పనితీరు ప్రశంసలందుకుంది.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అద్భుత నటనతో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఆయన స్టేజ్‌పై అవార్డు స్వీకరించిన క్షణాలు అభిమానుల హృదయాలను తాకాయి.
ఉత్తమ దర్శకుడిగా సుకుమార్
పాన్ ఇండియా స్థాయిలో కథనాలను అద్భుతంగా మలిచిన సుకుమార్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. సుకుమార్ అవార్డు స్వీకరించగా, హాల్లో హర్షధ్వానాలు మార్మోగాయి.
క్రిటిక్స్ అవార్డులు కూడా తెలుగు వారికే
క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ దర్శకుడిగా ప్రశాంత్ వర్మ నిలిచారు. ప్రత్యేక కాన్సెప్ట్‌లతో తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త జోష్ తెచ్చిన ఆయన ప్రతిభకు SIIMA సత్కారం లభించింది.
అలాగే ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా అవార్డు అందుకున్నారు. తన సహజ నటన, పాత్రలో మునిగిపోయే ప్రతిభకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది.
టాలీవుడ్‌కి అంతర్జాతీయ గుర్తింపు
SIIMA 2025 వేదికపై తెలుగు సినిమాలు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్, నటీనటుల ప్రతిభ, దర్శకుల సృజనాత్మకతతో తెలుగు సినిమా సౌత్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌లో నిలిచిందని చెప్పుకోవచ్చు.
సైమా’ 2025 అవార్డ్ విన్నర్స్ (తెలుగు) :
ఉత్తమ చిత్రం – కల్కి
ఉత్తమ దర్శకుడు – సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి – రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని – శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు – కమల్ హాసన్
ఉత్తమ పరిచయ నటి – పంకూరి, భాగ్యశ్రీ బోర్స్
ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు – సత్య
