Cm revanth: హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా జరిగిన కొలువుల పండగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు మరియు వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రెవెన్యూ ఉద్యోగుల సాధనలో పాత్రను ప్రస్తావిస్తూ, “ఉద్యమంలో రెవెన్యూ ఉద్యోగులు పోషించిన పాత్ర కీలకమైనది. అయితే గత పదేళ్లలో వారికి సరైన గుర్తింపు రాలేదు. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బందిని దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించారు. వారి సమస్యలను పట్టించుకోకుండా పక్కన పెట్టారు” అని విమర్శించారు.
అలాగే ధరణి వ్యవస్థపై రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. “గత ప్రభుత్వం రాష్ట్రానికి ధరణి అనే వైరస్‌ను అంటించింది. భూములు కొల్లగొట్టడమే లక్ష్యంగా ధరణి వ్యవస్థను వాడుకున్నారు. భూముల లెక్కలు తెలిసిన వీఆర్వో, వీఆర్ఏలను కావాలనే తొలగించారు. ధరణి ప్రజలకెందుకంటే కొరివి దయ్యంలా మారింది. అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే ధరణిని రద్దు చేశాం” అని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలతో రెవెన్యూ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా, ధరణి వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది.

