Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో గత 24 గంటల్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఇందులో 4.9 తీవ్రతతో వచ్చిన భూకంపం తాజాగా నమోదైంది.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.గత 24 గంటల్లో ఆఫ్ఘనిస్తాన్లో 4.1, 5.8 వంటి తీవ్రతలతో అనేక భూకంపాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం ప్రకంపనల సంఖ్య ఆరుకు చేరినట్లు సమాచారం. ఈ వరుస భూకంపాల వల్ల ఇప్పటికే 2,200 మందికి పైగా మరణించారు, 3,000 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా కునార్ మరియు నంగర్హార్ ప్రావిన్సులలో భారీగా ప్రాణ నష్టం జరిగింది.సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Also Read: Putin: భారత్, చైనాలపై ట్రంప్ బెదిరింపులు సరికాదు: పుతిన్
అయితే, రహదారులు మూసుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి కారణాల వల్ల సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సహాయ సామాగ్రిని పంపిస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి వరుస భూకంపాలు ఆప్ఘానిస్థాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సెప్టెంబర్ 1న రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 5,400 కంటే ఎక్కువ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి

