POCSO Act: ఓ కామాంధుడికి ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. అభం శుభం తెలియని మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగుడికి దీర్ఘకాల శిక్షను ఖరారు చేసింది. ఘటన జరిగిన ఏడేండ్ల తర్వాత నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతోనైనా కామాంధులకు కనువిప్పు కలగాలని పలువురు భావిస్తున్నారు.
POCSO Act: ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు భాస్కరాచారికి 20 ఏళ్ల జైలు శిక్షను, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.10 లక్షల రూపాయలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 2018 మార్చి 9వ తేదీన నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొట్టిముఖ్కల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
POCSO Act: ఘటన అనంతరం నిందితుడు భాస్కరాచారిపై వివిధ సెక్షన్ల కింద పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఐపీసీ 376, 4,5 (ఎం), పోస్కో యాక్ట్ 2012 సెక్షన్ల కింద నిందితుడిపై నమోదైన కేసుల మేరకు విచారణ జరిగింది. తాజాగా నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు ఈ తీర్పునిచ్చింది.