హైదరాబాద్లోని మైహోమ్ భుజా వినాయకుడి లడ్డూ ఈసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టించిన గణనాథుడి మహాప్రసాద లడ్డూను లక్షల రూపాయల నుండి వేలం మొదలు పెట్టారు. ఈ భారీ వేలంలో పోటీ పడి లడ్డూను కొండపల్లి గణేష్ రూ.51,07,777 లక్షలకు సొంతం చేసుకున్నారు.
ప్రతీ ఏటా జరిగే ఈ లడ్డూ వేలం పాటలో ఈసారి ఉత్సాహం మరింత ఎక్కువైంది. లడ్డూను సొంతం చేసుకోవడానికి పలువురు భక్తులు ఆసక్తి చూపగా, హోరాహోరీ బిడ్డింగ్ తర్వాత ఈసారి కొత్త రికార్డు నమోదైంది. లడ్డూ మహాప్రసాదంగా భావించే భక్తులు, దాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లడం శుభసూచకమని నమ్ముతారు.
మైహోమ్ భుజా వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, “ప్రతీ ఏటా ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాము. భక్తులు చూపిస్తున్న విశ్వాసం, భక్తి విశేషం” అని తెలిపారు.